Karnataka :రేవణ్ణ పాస్ట్ పోర్ట్ రద్దు చేయండి

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ.. కర్ణాట(Karnataka)క సీఎం సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే విధంగా అతడిని ఇండియాకు తిరిగి రప్పించే చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజ్వల్ రేవణ్ణ తన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి గత నెల 27న దేశం విడిచి పారిపోయారు. అనంతరం సిట్ బృందం అతనికి అరెస్ట్ వారెంట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. కాగా కర్ణాటక(Karnataka) ప్రభుత్వం పంపిన లేఖ అందిందని కేంద్ర విదేశాంగ మంతృత్వ శాఖ తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నామని.. చర్యలు ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ALSO READ :