Mallareddy :మల్లారెడ్డికి మరో షాక్

మేడ్చల్ జిల్లా బొమ్మరాసి పేట గ్రామంలోని పెద్ద చెరువు బఫర్ జోన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) నిర్మించిన ప్రహరీని ఇవాళ అధికారులు కూల్చివేశారు. గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో పలువురు 25 ఎకరాల స్థలంలో ప్రహరీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి(Mallareddy) సంబంధించి సర్వే నెంబర్ 408లో ఏడెకరాల ప్రహరీ కూడా ఉంది. దానిని ఇవాళ డీఎల్పీవో ఆధ్వర్యంలో శామిర్ పేట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఇటీవల సుచిత్ర సర్కిల్ పరిధిలో స్థల వివాదంతో మల్లారెడ్డిని, ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఆక్రమించి వేసుకున్న రోడ్డును అధికారులు ధ్వంసం చేశారు. వరుస వివాదాలతో మల్లారెడ్డి ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

ALSO READ :