Medigadda :మేడిగడ్డలో భారీ గుంత

Medigadda :కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ(Medigadda) లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ లో కుంగిన పియర్స్ ప్రాంతంలో మరో భారీ గుంత బయటపడింది. మీటరన్నర పొడవు, మీటరు వెడల్పుతో సుమారు 6 ఫీట్ల లోతుతో బొరియా కనబడింది. గుంతలో నుంచి నీళ్లు కిందకు ప్రవహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అది ఎంత లోతు ఉన్నదో తెలియదు. ఇంజినీరింగ్ అధికారులు టిప్పర్ మట్టితో గుంతను పూడ్చివేశారు.

ALSO READ :