Gandhi bhavan :కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తం

వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్​పార్టీ సీనియర్​నేత మల్లు రవి అన్నారు. ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్​ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? ప్రశ్నించారు. గాంధీభవన్‌లో(Gandhi bhavan) రవి మీడియాతో మాట్లాడుతూ ‘పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో వారి మాటల్లోనే తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఈసీ తెలిపింది. వెంటనే కేటీఆర్ ఆయన మాటలు విత్ డ్రా చేసుకోవాలి. ఆ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అతిథిగా సోనియా గాంధీ వస్తున్నరు. ఆమెను ఘనంగా సన్మానిస్తున్నం. తెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నం’ అని పేర్కొన్నారు.

ALSO READ :