RAVE PARTY :హేమ.. విచారణకు రండి

రేవ్ పార్టీ(RAVE PARTY) కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. జీఆర్ ఫామ్​హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డి (ఏ6), సినీ నటి హేమ, ఆషురాయ్‌ సహా 86 మందికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న (సోమవారం) విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. కాగా, రేవ్‌ పార్టీ(RAVE PARTY ) కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి కారు స్టిక్కర్‌ ఎవరు వాడారనే దానిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పూర్ణారెడ్డి అనే వ్యక్తి కాకాణి కారు స్టిక్కర్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల రెయిడ్స్​సమయంలో ఫామ్‌హౌస్‌ నుంచి పూర్ణారెడ్డి పరారైనట్లు గుర్తించారు. నిన్న సాయంత్రం బెంగళూరు సీసీబీ పోలీసులు పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలు సేకరిస్తున్నారు. ఏ2 అరుణ్ కుమార్, ఏ4 రణధీర్ బాబు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్​లో నమోదు చేశారు. రణధీర్ బాబు డెంటిస్ట్ గా, అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ALSO READ :