గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యాటక బృందానికి. కేరళ రాష్ట్రానికి విహారయాత్రకు పోయి.. గూగుల్ మ్యాప్ ఆధారంగా కొట్టాయం జిల్లాలోని అలప్పుళ ప్రాంతానికి వెళ్తుంటే నేరుగా అది కాలువలోకి తీసుకెళ్లింది. దీంతో కారు నీటిలో మునిగిపోయింది. అందులో ఓ మహిళతో సహా నలుగురు ఉన్నారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడకు వచ్చిన పోలీసులు.. పర్యాటకులను రక్షించారు. తరువాత కారను బయటకు తీశారు. శుక్రవారం అర్థరాత్రి కురుప్పంతర(Kuruppanthara) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే వీరు వెళ్లిన సమయానికి ఆ ప్రాంతంలో(Kuruppanthara) భారీ వర్షాలు కురస్తూ.. వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్ పై నమ్మకంతో పర్యటకులు ముందుకే వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరద నీటి నుంచి నేరుగా కాల్వలోకి వెళ్లారు. కాగా గత ఏడాది అక్టోబరులో కూడా కేరళలో ఇద్దరు యువ వైద్యులు వర్షంలో మ్యాప్స్‌ను అనుసరిస్తూ.. నదిలో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే.
ALSO READ :

