ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) గెలుచుకోవడంపై ఎక్స్‌లో గంభీర్ చేసిన ఓ పోస్ట్ ఇంటర్నెట్లో వైరలవుతోంది. ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి అంటూ ఆయన హిందీలో చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను ఆకర్శిస్తోంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ వ్యవహరించిన విషయం తెలిసిందే. కోల్ కతాలోట్రోఫీని గెలుచుకోవడంలో ఆయనది కీలక పాత్ర అనే చెప్పవచ్చు. మంచి వ్యూహ రచనతో జట్టును గంభీర్ వెనకుండి నడిపించాడు. ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గతంలో కెప్టెన్‌గా కోల్‌కతా ఫ్రాంచైజీకి గంభీర్ రెండు ట్రోఫీలను (2012, 2014) అందించాడు.
ALSO READ :

