ACB: ఏసీబీ కస్టడీకి ఏసీపీ

ACB

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ (ACB) కస్టడీలోకి తీసుకుంది. ఉస్మానియా హాస్పిటల్​లో మెడికల్ టెస్టుల అనంతరం ఆయన్ను బంజారాహిల్స్ ఏసీబీ(ACB) ఆఫీసుకు తరలించారు. ఉమామహేశ్వరరావు డైరీ, ల్యాప్​టాప్​లో ఇప్పటికే కొందరి పోలీస్​అధికారుల పేర్లు ఉండగా.. కస్టడీ విచారణలో మరికొంత మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఈనెల 22న అదుపులోకి తీసుకున్న అధికారులు.. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Also read: