Anjali :బాలయ్యకు థాంక్స్

గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి అంజలితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అంజలిని(Anjali) బాలకృష్ణ నెట్టివేయడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా అంజలి స్పందించింది. ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. బాలకృష్ణ గారు గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. మా మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది. అని అంజలి రాసుకొచ్చింది. ఈ ఈవెంట్‌లో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ, నవ్వుకున్న సందర్భాలకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అంజలి ట్వీట్ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా గతంలో డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ, అంజలి(Anjali) కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోయిన్ గా నటిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు గా యాక్ట్ చేస్తున్నారు.

ALSO READ :