Ponguleti: ప్రభుత్వ స్థలాలను అర్హులకు ఇస్తం

ponguleti srinivas reddy

ప్రభుత్వ స్థలాలు అన్నీ బయటకు తీయించి అర్హులైన వారికి ఆ స్థలాలను ఇస్తామని మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఇందిరమ్మ రాజ్యం రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు.- పేదవారికి అవసరమైన రెండు పోర్టు పొలియోల్లో తాను ఉన్నానని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వమన్నారు(Ponguleti). – పేదల ప్రభుత్వంలో ప్రజలు కోరిన కోరికల్లో అన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. – గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం లో పేదవారి కలలు కలలు గానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చాడన్నారు. ప్రభుత్వ ఆస్తుల చుట్టూ ప్రహరీ కట్టించి వాటిని రక్షిస్తామని చెప్పారు. – రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇండ్లు పూర్తి చేస్తే పాలేరు ప్రజలకు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు. గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. పెద్ద కొడుకుగా ఉండి పనిచేస్తానని చెప్పారు.

Also read: