Counting center: కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లొద్దు

counting center

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ సెంటర్ (Counting center) లోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజున మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని అరెస్ట్‌ నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన టీడీపీ ఏజెంట్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారించిన ధర్మాసనం కౌంటింగ్ రోజున సెంటర్‌కు (Counting center) వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు జడ్జిల ఎదుట ప్రదర్శించారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదు అంటూ పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం ఆదేశించింది.

Also read: