పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు (Maoist) అమర్చిన మందుపాతర పేలడంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గుట్టపై చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున జగన్నాథపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు.. నాలుగు ఎడ్ల బండ్లు కట్టుకొని వంట చెరుకు తేవడం కోసం అటవీ ప్రాంతానికి బయలుదేరారు. కొంగల గుట్ట వద్దకు చేరుకున్న ఇల్లందుల ఏసు, ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్యలు ఎండు కట్టెలు సేకరించడానికి గుట్టపైకి వెళ్లారు. ఈ క్రమంలో ముందుగా నడుస్తున్న ఇల్లందుల యేసు(50) మావోయిస్టులు (Maoist) అమర్చిన ల్యాండ్ మైండ్ పై కాలు వేయడంతో అది పేలింది. ఈ పేలుడు దాటికి ఏసు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి బండరాళ్లపై పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలైన యేసు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
Also read:

