Medchal: మెడికల్ షాపులో బిల్లింగ్ చేస్తుండగా..

ఓ కస్టమర్ కు బిల్లింగ్ చేస్తుండగా మెడికల్​షాపులోనే ఉద్యోగి చనిపోయాడు. మేడ్చల్ (Medchal) జిల్లా రాంపల్లిలోని సత్యనారాయణ కాలనీలో మెడ్ ప్లస్ (Medchal) మెడికల్ స్టోర్ లో కీసర గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసిన మురళి మెడ్ ప్లస్ లో ఉద్యోగం రావడంతో టీచింగ్ వదిలేసి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇవాళ షాపునకు వచ్చిన కస్టమర్లు తీసుకొన్న మందులకు బిల్ కొడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక్కసారిగా మురళి పడిపోయాడు. తోటి సిబ్బంది పరీక్షించి మురళీ మృతి చెందినట్టు నిర్ధారించారు. మురళి కింద పడిపోయిన దృశ్యాలు సీసీ టీవి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Also read: