Indian -2 :ఇండియన్–2లో కొత్త ట్విస్ట్

కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇండియన్. ఇందులో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. 1996 లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా ఇండియన్-2 (Indian -2)రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి. కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాభవాని నటిస్తున్న ఈ మూవీ జూన్ 12న విడుదల కాబోతుంది. ఇండియన్-2(Indian -2)కు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇందులో మనీషా కోయిరాలా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ రహస్యంగా ఉంచారట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో మనీషా కోయిరాలా కూడా ఉన్నట్లు నెటిజన్లు పట్టేశారు. ఇందులో మనీషా కోయిరాలా ఎలాంటి పాత్ర చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 53 ఏళ్ల వయసున్నఆమె ఇండియన్-2(Indian -2)లో ఏలా కనిపించనుందో చూడాలని సినీ ప్రియులు అతృతగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ మాత్రం మనీషా ఉన్నట్టు ఒక్క పోస్టర్ ను కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.

 

Also read :

Jammu&Kashmir: జమ్మూ కశ్మీర్‌లో హిందూ యాత్రికులపై దాడి

Aadhi srinivas: గుట్టలకు రైతుబంధు ఇవ్వం