ముంబైలో ఓ డాక్టర్ కి వింత అనుభవం ఎదురైంది. అతడు కొనుగోలు చేసిన ఐస్ క్రీమ్ (IceCream) లో మనిషి వేలు వచ్చింది. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో అనే యంగ్ డాక్టర్ ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు (IceCream) ఆర్డర్ పెట్టాడు. డెలీవరి అనంతరం దానిని తినడం మొదలుపెట్టాక.. నాలుకకు ఏదో గట్టిగా తగలింది. దీంతో అనుమానం వచ్చి దానిని పరీక్షించగా.. 2 అంగుళాల మనిషి వేలు కన్పించింది. దీంతో ఒక్కసారిగా అతడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు.
Also read:

