Guinness record: ఈ లవ్ మ్యారేజ్ గిన్నిస్‌ రికార్డ్స్

Guinness record

పాలో, కత్యూసియాకు అనే జంట ప్రపంచంలోనే అత్యంగా పొట్టి భార్యాభర్తలుగా రికార్డ్ సృష్టించారు. గిన్నిస్‌ రికార్డ్స్ (Guinness record) లో చోటు సంపాదించి.. ప్రేమకు శరీర ఆకృతి ఏ మాత్రం అడ్డుకాదని వీరు నిరూపించారు. బ్రెజిల్ కు చెందిన పాలో 35.54 అంగుళాల ఎత్తుండగా.. కత్యూసియా 35.88 అంగుళాల పొడవు ఉన్నారు(Guinness record). 2006లో సోషల్‌మీడియా వేదికగా పాలో, కత్యూసియాకుకు పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. పదేళ్ల అనంతరం వీరు వివాహం చేసుకున్నారు. అనంతరం ఇలా గిన్నీస్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: