ప్రపంచ కప్ లో నేపాల్‌పై (Bangladesh )బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో గ్రూప్ డీ నుంచి సూపర్-8కి ఆ టీం అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన (Bangladesh) బంగ్లాదేశ్.. 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నేపాల్.. 19.2 ఓవర్లలో 85 పరుగులకే చేతులెత్తేసింది. ఇక (Bangladesh) బంగ్లాదేశ్ లో షకిబ్ (17) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్ తన్జిమ్ ఫర్మామెన్స్ తో నేపాల్ జట్టు కుదేలైంది. నాలుగు వికెట్లు తీసుకున్న తన్జిమ్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. నేపాల్ బ్యాటర్లు కుశాల్ (27), దీపేంద్ర సింగ్ (25), ఆసిఫ్ (17) జట్టును గెలిపించే ప్రయ్నత్నం చేశారు.
నామమాత్రపు మ్యాచుల్లో శ్రీలంక, పాక్ విజయం. ఇక సూపర్-8కి అర్హత సాధించే అవకాశం లేని శ్రీలంక, పాకిస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచుల్లో విజయం సాధించాయి. నెదర్లాండ్స్‌పై శ్రీలంక 83 పరుగుల తేడాతో గెలువగా.. ఐర్లాండ్‌పై పాకిస్థాన్ అతికష్టంగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఇంటిముఖం పట్టాయి.
Also read:
KCR :విచారణ వద్దంటే అవినీతి ఒప్పుకున్నట్టే.
Kanappa: మల్టీ స్టారర్ కన్నప్ప

