NEET: నీట్ పై నిర్లక్ష్యమెందుకు?

NEET

లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన అంశంపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లక్ష్యం అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నీట్ (NEET) వ్యవహారంపై ఆయన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

_

ఇందులో నీట్ (NEET) పేపర్ లీక్ అయ్యింది అనడానికి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. కానీ బీహార్ లో ఇద్దరు నిందితులు నీట్ పేపర్ లీక్ లో తమ పాత్రను అంగీకరించారు. అలాగే బీహార్ పోలీసులు నీట్ పేపర్ లీక్ సంబంధం ఉన్న వారి నుంచి ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను సేకరించారు. బీహార్ పోలీసులు నీట్ లీక్ అంశంలో 9 మందిని విచారణకు పిలిచారు’ అని పలు పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్ లను ఆధారాలుగా చూపెట్టారు.

Also read: