Pocharam: బీఆర్ఎస్ నేతలపై కేసులు

Pocharam

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం (Pocharam) శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పోచారం (Pocharam) శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, వాసుదేవరెడ్డి, ఆంజనేయగౌడ్, కడారి స్వామి యాదవ్, తుంగబాలు, డీ రాజు, కే జానయ్య, వరికుప్పల వాసు, సీ దశరథ్ పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వారిపై ఐపీసీ 353, 448, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు పోలీసులు.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, వాసుదేవరెడ్డి, ఆంజనేయగౌడ్, కడారి స్వామి యాదవ్, తుంగబాలు, డీ రాజు, కే జానయ్య, వరికుప్పల వాసు, సీ దశరథ్ పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వారిపై ఐపీసీ 353, 448, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు పోలీసులు.

Also read: