తన జీవితం రైతులకు అంకితమని, రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) చెప్పారు. తన నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడడారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.(Pocharam Srinivas reddy) తాను ప్రభుత్వాన్ని ఆరు నెలల నుంచి గమనిస్తున్నానని, చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నారు. రేవంత్ రెడ్డి కొత్త సమస్యలను అధిగమిస్తూ ముందుకు పోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం సంకల్పించిన కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండాలనే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే ప్రారంభమైందని, తర్వాత టీడీపీలో చేరానని, ఆపై టీఆర్ఎస్ లోకి వచ్చానని, అప్పటి పరిస్థితుల కారణంగా పార్టీ మారానని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా 20 ఏండ్లు నాయకత్వం వహించే వయసుందని , ఆయనను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతున్నానని పోచారం చెప్పారు.
కాంగ్రెస్ లోకి పోచారం
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇవాళ ఉదయం పోచారం ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలని, సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
Also read:

