CM: శ్రీనివాసరెడ్డికి సముచిత స్థానం

CM

సీనియర్ నాయకుడు, రైతు సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని భావిస్తున్నామని CM సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తనకు అండగా ఉండాలని, ప్రభుత్వంలో భాగం కావాలని కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు. పోచారానికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని CM సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ, సంక్షేమం కోసం కీలక మైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు తమకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పెద్దలందరి సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తన జీవితం రైతులకు అంకితమని, రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తన నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడడారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తాను ప్రభుత్వాన్ని ఆరు నెలల నుంచి గమనిస్తున్నానని, చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నారు. రేవంత్ రెడ్డి కొత్త సమస్యలను అధిగమిస్తూ ముందుకు పోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం సంకల్పించిన కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండాలనే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే ప్రారంభమైందని, తర్వాత టీడీపీలో చేరానని, ఆపై టీఆర్ఎస్ లోకి వచ్చానని, అప్పటి పరిస్థితుల కారణంగా పార్టీ మారానని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా 20 ఏండ్లు నాయకత్వం వహించే వయసుందని , ఆయనను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతున్నానని పోచారం చెప్పారు.

Also read: