ఎమర్జెన్సీపై మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Kharge) తప్పుబట్టారు. దీనిపైనే మాట్లాడుతూ ఎంతకాలం పాలన సాగిస్తారని ప్రధానిని ప్రశ్నించారు. ఇలానే వందసార్లు చెబుతారని.. ఎమర్జెన్సీ విధించకుండానే మీరు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఖర్గే.. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విపక్షనేతలమంతా ఇలా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రూల్స్ పాటించలేదంటూ అభ్యంతరం తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలు.. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో రాజ్యాంగం కాపీలను చేత పట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే (Kharge)కూడా పాల్గొన్నారు.
Also read:

