18వ లోక్‌సభ (Lok Sabha) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ–3 సర్కారు ఏర్పడిన అనంతరం లోక్‌సభ ఫస్ట్సెషన్ ప్రారంభమైంది. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారంతో మొదటి రోజు సభ షురువైంది. తొలుత ప్రధాని మోదీ లోక్‌సభ (Lok Sabha) సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా పలువురు ఎంపీలు మోదీ.. మోదీ అని నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా వరుసగా ప్రమాణం చేశారు. తొలి రోజు మొత్తం 280 మంది ఎంపీలు.. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. మరోవైపు వయనాడ్ఎంపీగా రాహుల్రాజీనామాకు సభ ఆమోదం తెలిపింది.
విపక్షాల ఆందోళన (బాక్స్)
అంతకు ముందు సీనియర్ఎంపీ భర్తృహరి మహతాబ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన ఎన్నికల సందర్భంగా విపక్షాలు ఆందోళన చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వం సభా సంస్కృతిని పాటించడం లేదని కాంగ్రెస్‌విమర్శించింది. మరోవైపు లోక్‌సభలో ఎంపీ ప్రమాణ స్వీకారోత్సవం వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్షసభ్యులు ‘నీట్.. నీట్’ అని సభను హోరెత్తించారు.
27న రాష్ట్రపతి ప్రసంగం
27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రెసిడెంట్ స్పీచ్ ధన్యవాద తీర్మానంపై చర్చ 28న ప్రారంభం అవుతుంది. ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే చాన్స్ఉంది. ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
సైకిల్ పై పార్లమెంట్ కు
విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన పసుపు వస్త్రాలను ధరించి ఢిల్లీలోని తన గెస్ట్హౌజ్నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లారు. దీంతో స్థానికులు ఆయన్ను ఆసక్తిగా తిలకించారు.

విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన పసుపు వస్త్రాలను ధరించి ఢిల్లీలోని తన గెస్ట్హౌజ్నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లారు. దీంతో స్థానికులు ఆయన్ను ఆసక్తిగా తిలకించారు.
తెలుగులో కేంద్రమంత్రుల ప్రమాణం
తెలంగాణ, ఏపీ ఉభయ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి (సికింబ్రాబాద్), రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం) లోక్‌సభలో ప్రమాణం చేశారు.

Also read:

