బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన (Emergency) ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీలు ఖరారయ్యాయి. ‘దేశంలో అత్యయిక స్థితి ఏర్పడి ఇవాళ్టికి నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఆ చీకటి రోజులకు సంబంధించిన ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తున్నా’ అంటూ సెప్టెంబర్ 6న (Emergency) ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు కంగనా. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘మణికర్ణిక’ తర్వాత కంగన డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్ 24న విడుదల చేయాలని భావించారు. ఆతర్వాత జూన్ 14కు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్ 6ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.
బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీలు ఖరారయ్యాయి. ‘దేశంలో అత్యయిక స్థితి ఏర్పడి ఇవాళ్టికి నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఆ చీకటి రోజులకు సంబంధించిన ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తున్నా’ అంటూ సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు కంగనా. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘మణికర్ణిక’ తర్వాత కంగన డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్ 24న విడుదల చేయాలని భావించారు. ఆతర్వాత జూన్ 14కు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్ 6ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.
Also read:
Lok Sabha: కొలువుదీరిన కొత్త సభ

