బల్కంపేట(Balkampet) ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలకు రూ.20 కోట్లు కేటాయించినట్లు హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బల్కంపేట(Balkampet) దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలకు రాబోయే నెల రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గత సంవత్సరం బోనాలకు 15 కోట్లు నిధులు ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి చొరవతో ఈసారి రూ. 20 కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు.
ALSO READ :

