RAJANNA SIRICILLA : గ్రూప్1 రద్దు తో ఒకరు ఆత్మహత్య

RAJANNA SIRICILLA

రాజన్న సిరిసిల్ల(RAJANNA SIRICILLA) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ(TSPSC) గ్రూప్–1 పరీక్ష రద్దు చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని(RAJANNA SIRICILLA) బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేదని, అన్ని ఉద్యోగాలకు కూడా అనర్హుడుని అవుతున్నానని మనస్తపంతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

I QUIT ,తన చావుకు ఎవరూ కారణం కాదని నవీన్ (NAVEEN)సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తనకు గ్రూప్–1 పరీక్ష రద్దు కావడంతో ‌నిరాశ కలిగిందని..ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని.. జీవితం‌పై విరక్తి వచ్చిందని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు నవీన్.

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివిన నవీన్ కుమార్ సిరిసిల్లలోని(RAJANNA SIRICILLA) ఓ బ్రాండెడ్ రెడీమేడ్ షోరూంలో పనిచేసి మూడు నెలల క్రితం ఉద్యోగం మానేశాడు. ఇటీవల, అతను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఉద్యోగానికి అర్హత సాధించాడు, అయితే అతనికి ఎంబిఎ (MBA)డిగ్రీ లేదనే కారణంతో అధికారులు అతన్ని తిరస్కరించారు. నాగభూషణం, సుశీల దంపతుల మూడో కుమారుడు. అతని ఇద్దరు సోదరులు వివాహం చేసుకోగా, అతను అవివాహితుడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: