REVANTH REDDY, BANDI SANJAY: రేవంత్, బండికి లీగల్ నోటీసులు!

Bandi Sanjay

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ లీకేజీ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (REVANTH REDDY), బండి సంజయ్ (BANDI SANJAY) లకు ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

తనపై నిరాధారమైన , ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నరని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 revanth reddy
revanth reddy

వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో భారతీయ శిక్షా స్మృతిలోని 499, 500 నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదురుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులు కేటీఆర్ ప్రస్తావించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ కార్యాలయానికి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన పీఏ తిరుపతి హస్తం ఉన్నదని, ఆయన సొంత మండలం మల్యాలలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వంద మందికి 100కు పైగా మార్కులు ఈ కేసులో మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.

దీనిపై సిట్ అవసరం లేదని, కేంద్రం రంగంలోకి దిగి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మరొకొరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్మనారు. అయితే రాజకీయ దురుద్దేశ్యంతోనే రేవంత్, సంజయ్ లు తనపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

Also read

TSPSC: బోర్డు పీకి.. గేట్లు దుంకి..

RAJANNA SIRICILLA : గ్రూప్1 రద్దు తో ఒకరు ఆత్మహత్య