Dharani :ధరణి దరఖాస్తులు..పంద్రాగస్టులోగా క్లియర్ చేయండి

పెండింగ్ లో ఉన్న ధరణి(Dharani) దరఖాస్తులను పంద్రాగస్టులో క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ధరణిలో(Dharani) సమస్యపై దరఖాస్తు చేసేవారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. ధరణిలో కొన్ని టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశాన్ని పరిశీలించాలించాలని సూచించారు.

ALSO READ :