TVK :తలపతి పాదయాత్ర?

త‌మిళ‌గ వెట్రిక‌ళ‌గం(TVK) అనే పార్టీ స్థాపించిన తమిళ హీరో తలపతి విజయ్ 2026 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారట. ఇందుకోసం ఒంటరిగా వెళ్లాలా..? ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా..? అనే అంశంపై పలువురితో చర్చిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీని(TVK) జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు 30 విభాగాల ఏర్పాటు చేయడంతోపాటు రెండు లక్షల మందికి పార్టీ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఎన్నికల గుర్తుకోసం దరఖాస్తు చేసిన విజయ్.. తన సన్నిహితుల ద్వారా గుర్తు త్వరగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గుర్తు కేటాయించగానే భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నరని సమాచారం. ఈ సభ నుంచే పార్టీ ఉద్దేశాలు, సిద్దాంత‌లు చెప్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లోకేశ్ మాదిరిగానే తమిళనాట పాదయాత్ర చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇంత‌వ‌ర‌కూ ఎంతో మంది న‌టీన‌టులు రాజ‌కీయాల్లో కొన‌సాగినా.. ఎవరూ పాదయాత్ర చేయలేదు. విజయ్ పాదయాత్ర చేసిన తొలి నటుడిగా చరిత్రకెక్కుతారు.

ALSO READ :