శంకర్ దర్వకత్వంలో రాంచరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం గేమ్ చేంజర్(RC15). ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తోన్న ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమా కోసం దిల్ రాజు 200 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టారు. ఇటీవల శంకర్ నుంచి వచ్చిన ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో గేమ్ చేంజర్ పై మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. నిర్మాత దిల్ రాజు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాని(RC15) కమర్షియల్ గా బిజినెస్ చేసుకోవడం ఎలాగో దిల్ రాజుకి తెలుసు. అందుకే టేబుల్ ప్రాఫిట్ తోనే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే చర్చ సాగుతోంది. మెగా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. వారందరికీ దిల్ రాజు సమాధానం ఇచ్చేశాడు. రాయన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుందని ఫ్యాన్స్ అడిగారు. క్రిస్మస్ కి కలుద్దామని చెప్పాడు. దీంతో డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
ALSO READ :

