Modi: పదవిపైనే మోదీ దృష్టి

బడ్జెట్ పై అఖిలేశ్ యాదవ్  ఢిల్లీ: పదవిని, అధికారాన్ని కాపాడుకోవడంపైనే ప్రధాని మోదీ(Modi) దృష్టి పెట్టారని, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, కన్నౌజ్ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేశారన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మనుగడ కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చాలా ముఖ్యం అని గుర్తు చేశారు(Modi). దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు బడ్జెట్ కేటాయింపులు ఎందుకు లేవని అఖిలేశ్ ప్రశ్నించారు. ‘ఒకవేళ ప్రభుత్వం మనుగడ కాపాడుకోవాలంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలు ప్రకటించడం మంచి విషయం. కానీ, దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర రైతాంగం కోసం ఏదేనా పెద్ద నిర్ణయం ప్రకటించారా? రైతుల పంటల దిగుబడి పెంపు, పంటల ధరల పెంపునకు ఏ నిర్ణయమైనా తీసుకున్నారా?’ అని నిలదీశారు.

ALSO READ :