కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్(AP) కు వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల ఆర్థికసాయం చేయనున్నట్టు తెలిపింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలా సీతారామన్ వివరించారు. విభజన చట్టం క్రింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు కల్పిస్తామని అన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల డెవలప్మెంట్ కు తోడ్పాటు అందించనున్నట్టు చెప్పారు. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేస్తామని సీతారామన్ తెలిపారు.
ALSO READ :

