దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక(TG) దృష్టి సారించింది. వరల్డ్ క్లాస్ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో సౌకర్యాల కల్పన కోసం రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం(TG) తెలిపింది. లండన్ లోని థేమ్స్ నదిని తలపించేలా మూసీని తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 1,500 కోట్లు కేటాయించింది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్ కు 3,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏకు రూ. 500 కోట్లు, జలమండలికి 3,385 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన హైడ్రాకు 200 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించనున్న మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఓఆర్ఆర్ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు, ఎంఎంటీఎస్ సేవల విస్తరణ కోసం రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు, పాతనగరంలో మెట్రో సేవల కోసం 500 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.
ALSO READ :

