ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఇబ్బందుల్లో పడింది. అమెరికా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Haris)కు నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీ విరాళం ఇవ్వడమే దీనికి కారణం. దీంతో సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పై నిరసన వ్యక్తమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ బహిష్కరించాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కమలా హారిస్(Haris) కు రీడ్ హేస్టింగ్స్ సుమారు 7 మిలియన్ల డాలర్ల విరాళం ఇచ్చారు. హారిస్‌ను ఉద్దేశించి నిరాశకు గురిచేసిన డిబేట్ తర్వాత మేం మళ్లీ గేమ్‌లోకి వచ్చామనిహేస్టింగ్స్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మద్దతుదారులు క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్ హ్యాష్‌ట్యాగ్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ALSO READ :

