బండి సంజయ్ అరెస్టు నేపషథ్యంలో పోలీసులను తిట్టినట్టు వచ్చిన ఆరోపణలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(RAGHUNANDAN RAO) స్పందించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడానో గుర్తులేదని రఘునందన్ రావు (RAGHUNANDAN RAO) చెప్పారు. తాను ఏనాడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఒకవేళ తప్పుగా మాట్లాడి తన మాటలను ఉంటే విత్ డ్రా చేసుకుంటున్నానని తెలిపారు. స్పీకర్ తనకు నోటీసు పంపితే సమాధానం చెప్తానని రఘనందన్ వెల్లడించారు. 2023, ఏప్రిల్ 5వ తేదీన పోలీసులను ఉద్దేశించి రఘనందన్ ఘాటు వ్యాఖ్యలు చేశారని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించిన రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఐపీఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు.
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) April 6, 2023
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు పోలీసులు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు.
ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు.
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్థరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అర్థరాత్రి కరీంనగర్ నుంచి యాదాద్రి వరకు తీసుకొచ్చారు. రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటి ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.
ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు ఎంపీ బండి సంజయ్. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా బలవంతం చేసింది.. సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు బండి సంజయ్.
Also Read
BANDI SANJAY: ఖమ్మం జైలుకు బండి సంజయ్

