(BRS ) బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం 70 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు ఏడు లక్షల కోట్లకు చేరిందని అన్నారు. అప్పులు తెచ్చిన సొమ్మును కమీషన్లు వచ్చే కాంట్రాక్టుల కోసమే ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి.. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఇప్పటి వరకు కేవలం 412 టీఎంసీల నీటిని మాత్రమే పంప్ చేశారని అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా రైతులు నష్టపోయారని అన్నారు.( BRS) బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే కేవలం మిత్తీ కూడా మాఫీ కాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు రూ. 1.50 లక్షల లోపు ఉన్న రైతుల అప్పులు మాఫీ చేసిందని, పంద్రాగస్టు నాటికి రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయబోతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని నిరూపించామని అన్నారు. తమ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రూ. 15వేల సాయం అందించబోతోందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల కు పెంచిందని చెప్పారు. రైతు బంధు కింద రూ. 80 వేల కోట్లను పంపిణీ చేసిన గత ప్రభుత్వం అందులో 33 వేల కోట్లను అనర్హులకే ఇచ్చిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం 70 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు ఏడు లక్షల కోట్లకు చేరిందని అన్నారు. అప్పులు తెచ్చిన సొమ్మును కమీషన్లు వచ్చే కాంట్రాక్టుల కోసమే ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి.. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఇప్పటి వరకు కేవలం 412 టీఎంసీల నీటిని మాత్రమే పంప్ చేశారని అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా రైతులు నష్టపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే కేవలం మిత్తీ కూడా మాఫీ కాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు రూ. 1.50 లక్షల లోపు ఉన్న రైతుల అప్పులు మాఫీ చేసిందని, పంద్రాగస్టు నాటికి రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయబోతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని నిరూపించామని అన్నారు. తమ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రూ. 15వేల సాయం అందించబోతోందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల కు పెంచిందని చెప్పారు. రైతు బంధు కింద రూ. 80 వేల కోట్లను పంపిణీ చేసిన గత ప్రభుత్వం అందులో 33 వేల కోట్లను అనర్హులకే ఇచ్చిందని ఆరోపించారు
Also read:

