RIO :ప్రీ క్వార్టర్స్ కు పీవీ సింధు

ఒలింపిక్స్ లో స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీక్వార్టర్స్ కు చేరింది. ఇవాళ జరిగిన బాడ్మింటన్ మహిళ సింగిల్స్ సెకండ్ రౌండ్‌లో సింధు ఏక పక్ష విజయం సాధించింది(RIO). ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్‌పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. కేవలం అర గంటలోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ఒలింపిక్స్‌లో మరో మెడల్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లింది. తాజా విజయంతో సింధు గ్రూప్-ఎన్ టాపర్‌గా నిలిచి రౌండ్-16 (ప్రిక్వార్ట్స్)కు చేరుకుంది. నెక్ట్స్ ప్రిక్వార్ట్స్‌ మ్యాచ్‌ను సింధు గురువారం ఆడనుంది. కాగా, సింధు రియో(RIO), టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ సింధు పతకం సాధిస్తుందనే ఆశలున్నాయి.

ALSO READ :