కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు గోరంతేనని మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. రాష్ట్రం క్యాన్సర్, ఎయిడ్స్ రోగిలాగా దివాలా తీసిందన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాటలు సరికావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాకు రెవెన్యూ మిగులుతో అప్పగిస్తే మేం అప్పుల కుప్పగా మార్చామంటున్నారన్నారు. 2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ.369 కోట్లని, 2022-23లో రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో తమకు రాష్ట్రాన్ని అప్పగించిందన్నారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థికమంత్రి చెబుతున్నారని, బడ్జెట్‌లో మాత్రం రెవెన్యూ మిగులు ఉందని పేర్కొంటున్నారని విమర్శించారు. మంత్రులు సభలో చెప్పిన మాటలు తప్పా.. బడ్జెట్‌లో ఉన్న లెక్కలు తప్పా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాజీనామాకు రెడీ
తాము అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని, ఇప్పటి వరకు ఇక్క ఉద్యోగం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి రిజల్ట్స్ వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలే ఇచ్చిందని స్పష్టం చేశారు. అపాయింట్‌మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు.
ALSO READ :

