హనుమకొండ : రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసలు బీజేపీ తో బీఆర్ఎస్, ఎంఐఎం కు ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా హనుమకొండ కేయూ వద్ద విలేకరులతో భట్టి మాట్లాడుతూ, ఎంఐఎం కూడా స్పందించడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారని గుర్తుచేశారు. కేంద్రం జనగణనను వెంటనే మొదలు పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్‌ను తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షలా 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 54 శాతం ఉన్న బీసీలకు 5 శాతం బడ్జెట్ ఇస్తరా? అని నిలదీశారు. బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పొదేం వీరయ్య, మాజీ ఎంపీ రాజయ్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
