Kerala: వయనాడ్ లో రాహుల్, ప్రియాంక

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకాగాంధీ (Kerala)  కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇవాళ ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. సహాయ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత నెల 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..Image వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొందరి ఆచూకీ లభించడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో డీఆర్ఎఫ్ బృందాలున్నాయి.Image ( Kerala)  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఇవాళ ఉదయం వయనాడ్ వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ విలయంలో మృతుల సంఖ్య 277కు చేరినట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. మరో 200 మందికి పైగాImage గాయపడినట్లు తెలిపాయి. ఇంకా 240 మంది ఆచూకీ తెలియరాలేదు.వయనాడ్ లో రాహుల్, ప్రియాంక
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇవాళ ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. సహాయ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత నెల 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొందరి ఆచూకీ లభించడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో డీఆర్ఎఫ్ బృందాలున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఇవాళ ఉదయం వయనాడ్ వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ విలయంలో మృతుల సంఖ్య 277కు చేరినట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. మరో 200 మందికి పైగా గాయపడినట్లు తెలిపాయి. ఇంకా 240 మంది ఆచూకీ తెలియరాలేదు.

Also read: