హైదరాబాద్ : వివేకానంద హత్య కేసు విషయమై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాఫ్తు కావాలన్న జగన్(JAGAN), అధికారంలోకి వచ్చాక మాట మార్చాడని ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీబీఐ కావాలని అడిగింది వారే తప్పుపడుతుందీ వారేనని మండిపడ్డారు. వాళ్లకు అనుకూలంగా ఉంటే ఒకలా వ్యతిరేకంగా ఉంటే మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాను తప్పు చేస్తే తనను ఉరి తీయొచ్చని చాలెంజ్ చేశారు. వాళ్లది తప్పైతే ఎలాంటి శిక్ష కైనా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సునీత పట్టుదల పోరాటం కారణంగానే ఇక్కడ దాకా వచ్చిందని చెప్పారు. గొడ్డలి ఎక్కడ కొన్నారు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు తదితర అన్ని విషయాలు దర్యాప్తు సంస్థకు తెలుసనన్నారు. సీబీఐ నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని, దీంతో దర్యాప్తు ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ALSO READ :
