సుంకిశాల పంప్ హౌస్ నిర్మిస్తున్న( Megha sanstha) మేఘా సంస్థపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల బృందం సుంకిశాల లో కూలిపోయిన రిటైనింగ్ వాల్ ను సందర్శించింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు కూలిందో అంచనా వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్లే వాల్ కూలిపోయిందని ఆరోపించారు. మంత్రులు చెబుతున్నట్టుగా ఇది చిన్న నష్టమేం కాదని, 2 వేల కోట్ల రూపాయల నష్టమని చెప్పారు. అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయే వారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ఇజ్జత్ కూడా పోయేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు (Megha sanstha) మేఘా నాసిరకంగా పనులు చేస్తోందని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే సంస్థకు పనులెందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ..మేఘా కంపెనీనీ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రభుత్వం కావాలని గోప్యత పాటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు.
సుంకిశాల పంప్ హౌస్ నిర్మిస్తున్న మేఘా సంస్థపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల బృందం సుంకిశాల లో కూలిపోయిన రిటైనింగ్ వాల్ ను సందర్శించింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు కూలిందో అంచనా వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్లే వాల్ కూలిపోయిందని ఆరోపించారు. మంత్రులు చెబుతున్నట్టుగా ఇది చిన్న నష్టమేం కాదని, 2 వేల కోట్ల రూపాయల నష్టమని చెప్పారు. అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయే వారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ఇజ్జత్ కూడా పోయేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా నాసిరకంగా పనులు చేస్తోందని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే సంస్థకు పనులెందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ..మేఘా కంపెనీనీ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగితే ప్రభుత్వం కావాలని గోప్యత పాటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు.

