Jagadhesh Reddy : హరీశ్ కరెక్టే!

కేసీఆర్​ హాయంలోనే సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని, బటన్ నొక్కే అదృష్టం కాంగ్రెస్​కు కొచ్చిందని హరీశ్​రావు  మాట్లాడితే మంత్రి ఎందుకు కుమిలిపోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి (Jagadhesh Reddy)ప్రశ్నించారు. తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్ట్​ ఓపెనింగ్​బటన్ నొక్కేటప్పుడు ఇది కేసీఆర్ కష్టం అని మంత్రులు చెప్పాలని హరీశ్​రావు చెప్పడంలో తప్పేముందన్నారు.

కాంగ్రెస్ మంత్రులు భుజాలు తడుముకుని సమాధానాలు చెప్పలేక ఏడ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో రూ.41 వేల కోట్లు అని చెప్పి, రూ. 39 వేల కోట్లకు తెచ్చారని, దాన్ని రూ.36 వేల కోట్లు చేసి, ఆఖరికి రూ. 12 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పథకాల అమలుకు డెడ్లైన్లు పెట్టుకున్నారని, కానీ డెడ్లైన్లు అయిపోయిన పథకాలు మాత్రం అమలు కాలేదన్నారు. కాల్వలు తవ్వకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సుటు చెల్లించారని, కమీషన్లు ఇవ్వడం, తీసుకోవడం కాంగ్రెస్​నాయకులకు అలవాటుగా మారిందన్నారు.

 

Also read :

Murder : బార్బర్ షాపులో మర్దర్

KTR: అప్పుల్లో కొత్త రికార్డు