హిమాచల్(HIMACHAL PRADESH) లో చిక్కుకుపోయిన నలుగురు తెలుగు స్టూడెంట్స్
ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్న పేరెంట్స్
మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసిన తల్లిదండ్రులు
సాయం చేస్తామని హామీ
సిమ్లా : భారీ వర్షాలు, వరదల కారణంగా హిమాచల్(HIMACHAL PRADESH) ప్రదేశ్‌లో పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో పెద్ద సంఖ్యలో యాత్రికులు చిక్కుకుపోయిన వారిలో ఉన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో చదువుతున్న నలుగురు తెలుగు విద్యార్థులు కసోల్ లో చిక్కుకుపోయారు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోవడంతో యాత్రికులు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. చిక్కుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ జేశామని, కులు
కులు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి విద్యార్థులకు సాయం అందించాలని ఆదేశించినట్లు కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు.
వర్షాలు, వరదలతో అఈతలాకుతలం…
భారీ వర్షాలకు బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వంతెనలతో పాటు రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. అయితే, బుధవారం నుంచి ఈ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఉత్తరాఖం డ్ లో మాత్రం మరో 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. పంజాబ్, హర్యానా , పశ్చిమ ఉత్తరప్రదేశ్, దక్షిణ రాజస్థా న్ లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాల పడే అవకాశమున్నట్లు తెలిపారు. దీంతో చార్ధామ్ యాత్రికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సూచించారు. అటు ప్రతికూల వాతావరణంతో జమ్మూకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.
also read:
HYDERABAD : అమ్నేషియా పబ్ రేప్ కేసు వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు మైనరేనని హైకోర్టు తీర్పు;

