Delhi: అమల్లోకి ఎలక్షన్ కోడ్

Delhi Elections comiission of india

ఢిల్లీ: (Delhi )ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఎన్నికల కమిషన్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ఇకపై మంత్రులు అధికారిక వాహనాలు, ప్రభుత్వ భవనాలను వినియోగించకూడదు. (Delhi)కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించవద్దు, అధికారికంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయవద్దు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవి..

  • ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులు, వాహనాలు, ప్రభుత్వ భవనాలు వంటి యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.
  •  కరపత్రాలు, బ్యానర్లు , పార్టీ జెండాలు మొదలైనవి స్థల యజమాని అనుమతి లేకుండా అంటించరాదు.
  • అభ్యర్థులు వ్యక్తిగత జీవితం, కుటుంబంపై వ్యాఖ్యలు చేయకూడదు. ఎన్నికల ప్రచారం కోసం మతపరమైన ప్రదేశాలు వాడకూడదు.
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులను ప్రారంభించడం.. వాటికి శంకుస్థాపన చేయడం వంటివి చేయరాదు.
  •  సంక్షేమ పథకాలు.. వాటికి సంబంధించిన ప్రచారాలను నిలిపివేస్తారు.
  •  ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ప్రభుత్వ సంస్థలు ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.
  •  సమావేశ స్థలాలు, హెలిప్యాడ్​లు, ప్రభుత్వ అతిథి గృహాలు వంటివి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
  •  మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు పూర్తిగా నిషేధం.
  •  తమ ఎన్నికల ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించే ముందు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి.
  • ఎన్నికల ర్యాలీల నిర్వహణకు ముందు అభ్యర్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఎన్నికలు ముగిసే వరకు ఈ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉంటాయి. ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది.

Also Read :