నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లపై బుల్డోజర్లను పంపడం ఎక్కడి న్యాయమని, నిందితుడి ఇంటిని ఎలా కూల్చేస్తారని (Supreme Court) సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్య నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వాటిని అడ్డుకోవాలని కోరుతూ.. సుప్రీంకోర్టు (Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. నిందితుల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో కూల్చివేతలను ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే.. చట్టం సూచించిన విధానాన్ని అనుసరించాలి కానీ ఆస్తిని కూల్చివేయొద్దని సూచించింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ.. ‘‘కేవలం నిందితుడిగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని కూల్చివేయట్లేదు. అది అక్రమకట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నాం’ అని కోర్టుకు విన్నవించారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లపై బుల్డోజర్లను పంపడం ఎక్కడి న్యాయమని, నిందితుడి ఇంటిని ఎలా కూల్చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్య నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వాటిని అడ్డుకోవాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. నిందితుల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో కూల్చివేతలను ఎలా చేపడతారని ప్రశ్నించింది. ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే.. చట్టం సూచించిన విధానాన్ని అనుసరించాలి కానీ ఆస్తిని కూల్చివేయొద్దని సూచించింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ.. ‘‘కేవలం నిందితుడిగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని కూల్చివేయట్లేదు. అది అక్రమకట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నాం’ అని కోర్టుకు విన్నవించారు.

Also read:
Supreme Court: నిందితుడి ఇంటిని కూల్చేస్తారా..?
Simha Koduri: మత్తువదలరా–2 టీజర్ రిలీజ్