Mahesh Kumar Goud: వరదలొచ్చినా​స్పందించరా?

కేసీఆర్ కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా?
ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ కనిపించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి లేదా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో  (Mahesh Kumar Goud)మహేశ్​కుమార్​గౌడ్​ మీడియాతో మాట్లాడుతూ ‘ఏపీలో జగన్ కు 11 సీట్లు మాత్రమే వచ్చినా ప్రజల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ కేసీఆర్ కు 39 సీట్లు ఇచ్చినా.. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. విపత్తు వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్​కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా? కేటీఆర్​ఇంగ్లాండ్ లో ఉండి పసలేని ట్వీట్లు పెడ్తూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడిన గందరగోళంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పడు సమీక్షిస్తూ.. అధికారులతో చర్చిస్తూ.. పరిస్థితులను ఆరా తీస్తున్నారు’ అని తెలిపారు.

కేసీఆర్ కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా?
ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ కనిపించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి సాయం చేయాల్సిన సోయి లేదా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మహేశ్​కుమార్​గౌడ్​మీడియాతో మాట్లాడుతూ ‘ఏపీలో జగన్ కు 11 సీట్లు మాత్రమే వచ్చినా ప్రజల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ కేసీఆర్ కు 39 సీట్లు ఇచ్చినా.. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. విపత్తు వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్​కు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా? కేటీఆర్​ఇంగ్లాండ్ లో ఉండి పసలేని ట్వీట్లు పెడ్తూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడిన గందరగోళంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పడు సమీక్షిస్తూ.. అధికారులతో చర్చిస్తూ.. పరిస్థితులను ఆరా తీస్తున్నారు’ అని తెలిపారు.

Also read: