పట్టుదల ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చని నిరూపించింది భారత అథ్లెట్, మన తెలంగాణ బిడ్డ (Deepti Jiwanji) దీప్తీ జివాంజి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్న ఆమె పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తాజాగా పారిస్ లో జరుగుతున్న 2024 పారాలింపిక్స్ లో మహిళల 400 మీ. టీ20 ఫైనల్స్ లో మంగళవారం కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన (Deepti Jiwanji) దీప్తి మానసిక వైకల్యంతో జన్మించింది.
ఆమెను చూసి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి ఎంతో బాధపడేవారు. దీప్తి పెదవులు, ముక్కు చిన్నవిగా, వంకరగా ఉండేవని అంతా ఆమెను పిచ్చి, కోతి అని ఏడిపించేవారు. కుటుంబమంతా రోజూ పనికి వెళ్తే పూట గడవని పరిస్థితి వారిది. చిన్నప్పుడు దీప్తిని ఎవరైనా పిల్లలు, గ్రామస్తులు తనను ఆటపట్టిస్తే తన వద్దకి వచ్చి ఏడ్చేది. అప్పుడు కొద్దిరోజుల్లో నీకు పరమాన్నం, చికెన్ చేసి పెడతానని చెప్పి నవ్వించేది. దీప్తి పతకం సాధించడంతో తండ్రి యాదగిరి ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. “ఈరోజు తమకి ఎంతో శుభదినమన్నారు. భవిష్యత్తులో దీప్తి ఇలాంటి పతకాలు ఎన్నో గెలవాలని కోరుకుంటున్నట్టు ఆయన ఆనందం ఆకాంక్షించారు.
పట్టుదల ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చని నిరూపించింది భారత అథ్లెట్, మన తెలంగాణ బిడ్డ దీప్తీ జివాంజి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్న ఆమె పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తాజాగా పారిస్ లో జరుగుతున్న 2024 పారాలింపిక్స్ లో మహిళల 400 మీ. టీ20 ఫైనల్స్ లో మంగళవారం కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దీప్తి మానసిక వైకల్యంతో జన్మించింది. ఆమెను చూసి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి ఎంతో బాధపడేవారు. దీప్తి పెదవులు, ముక్కు చిన్నవిగా, వంకరగా ఉండేవని అంతా ఆమెను పిచ్చి, కోతి అని ఏడిపించేవారు.
కుటుంబమంతా రోజూ పనికి వెళ్తే పూట గడవని పరిస్థితి వారిది. చిన్నప్పుడు దీప్తిని ఎవరైనా పిల్లలు, గ్రామస్తులు తనను ఆటపట్టిస్తే తన వద్దకి వచ్చి ఏడ్చేది. అప్పుడు కొద్దిరోజుల్లో నీకు పరమాన్నం, చికెన్ చేసి పెడతానని చెప్పి నవ్వించేది. దీప్తి పతకం సాధించడంతో తండ్రి యాదగిరి ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. “ఈరోజు తమకి ఎంతో శుభదినమన్నారు. భవిష్యత్తులో దీప్తి ఇలాంటి పతకాలు ఎన్నో గెలవాలని కోరుకుంటున్నట్టు ఆయన ఆనందం ఆకాంక్షించారు.
Also r ead:

