బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధాని (Narendra Modi)నరేంద్ర మోదీ అనంతరం సింగపూర్ చేరుకున్నారు. ఆరేళ్ల తర్వాత సింగపూర్ చేరుకున్న ప్రధానికి చాంగి విమానాశ్రయంలో ఆ దేశ అధికారులు ఘన స్వాగతం పలికారు.పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు అక్కడకు చేరుకుని కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ డోల్ వాయించి అక్కడి వారిని ఆనందంలో ముంచేశారు. ఓ మహిళ ప్రధానికి రాఖీ కట్టారు. పలువురు మోదీ సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అనంతరం ప్రధాని కౌంటర్ పార్ట్ లారెన్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రి లీ సీన్ లూంగ్, మరో సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా వాంగ్, లీ వేర్వేరుగా ప్రధాని మోదీకి విందు ఇవ్వనున్నారు. అనంతరం భారత్- సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై అక్కడి నేతలతో చర్చింనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ప్రధాని మోదీ కలవనున్నారు.
బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధాని (Narendra Modi) నరేంద్ర మోదీ అనంతరం సింగపూర్ చేరుకున్నారు. ఆరేళ్ల తర్వాత సింగపూర్ చేరుకున్న ప్రధానికి చాంగి విమానాశ్రయంలో ఆ దేశ అధికారులు ఘన స్వాగతం పలికారు.పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు అక్కడకు చేరుకుని కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ డోల్ వాయించి అక్కడి వారిని ఆనందంలో ముంచేశారు. ఓ మహిళ ప్రధానికి రాఖీ కట్టారు. పలువురు మోదీ సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అనంతరం ప్రధాని కౌంటర్ పార్ట్ లారెన్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రి లీ సీన్ లూంగ్, మరో సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా వాంగ్, లీ వేర్వేరుగా ప్రధాని మోదీకి విందు ఇవ్వనున్నారు.
అనంతరం భారత్- సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై అక్కడి నేతలతో చర్చింనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ప్రధాని మోదీ కలవనున్నారు.
Also read:
