కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్(nizamsagar) ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో నిజాంసాగర్(nizamsagar) ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో హల్ది వాగు, పోచారం ప్రాజెక్టు నుంచి పొంగి ప్రవహిస్తున్న వరద నీరు ఉధృతంగా నిజాంసాగర్‌లోకి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి ఇవాళ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు గాను, ప్రసుత్తం 1404 అడుగుల నీరు నిల్వ ఉంది. నీటి విడుదల నేపథ్యంలో దిగువన మంజీరా నది పరివాహక ప్రాంత, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు
=మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ అధికారులతో కలిసి నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక పక్క రూ. 2 లక్షల రుణమాపీ, మారో వైపు సమృద్ధిగా వర్షాలు పడటంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ALSO READ :
